లక్ అంటే ఇతనిదే -వలకు చిక్కిన చేపలతో కోటీశ్వరుడయ్యాడు

Became a millionaire with entangled fish

0
97

ఈ మధ్య మనం జాలర్లకు కొన్ని అరుదైన చేపలు దొరికిన వార్తలు వింటున్నాం. అయితే వాటి ధర మాత్రం లక్షల్లో ఉంటుంది. తాజాగా నెల రోజుల తర్వాత ముంబైలోని జాలర్లకు పని మొదలైంది. తుఫానులు రావడంతో ఇక్కడ గత కొన్ని రోజులుగా జాలర్లు వేటకు వెళ్లలేదు. అయితే తాజాగా జాలర్లు మళ్లీ గంగమ్మని నమ్ముకుని ప్రయాణం చేశారు.

ఇలా చంద్రకాంత్ తారే అనే జాలరికి అదృష్టం వరించింది. ఎందుకంటే అతని వలకి ఘోల్ జాతికి చెందిన చేపలు చిక్కాయి. ఆ చేపలు వలకు చిక్కడంతో చంద్రకాంత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇవి మార్కెట్లో లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి.

ఒడ్డుకు వచ్చిన చంద్రకాంత్ తన దగ్గర ఉన్న చేపలను వేలం వేయడానికి రెడీ అయ్యాడు. అంతే వ్యాపారులు క్యూలు కట్టేశారు. సుమారు ఒక్కొక్కటి రూ.85 వేల రేటు పలికింది ఇలా మొత్తం తన వలలో పడిన 157 చేపలు అమ్మాడు. మొత్తం 1.33 కోట్లు అతనికి వచ్చింది. అతన్ని అందరూ అదృష్టజాతకుడు అంటున్నారు.