SBI కస్టమర్లకు బిగ్ అలెర్ట్..అప్డేట్ చేసుకోకుంటే అంతే సంగతులు..

0
154

SBI కస్టమర్లకు అలెర్ట్. yono యాప్ సేవలు వినియోగించుకుంటున్న వారు కొత్త వెర్షన్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అయితే పాత వెర్షన్ ఇంకా వాడుతుంటే తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఓఎస్ 9లో ఉన్న వెర్షన్లకు గూగుల్ సెక్యూరిటీ అప్డేట్స్ ను నిలిపివేసింది. దీనితో ఇది ఏ మాత్రం సురక్షితం కాదని తెలిపింది.

పాత వెర్షన్ వాడడం వల్ల సైబర్ నేరగాళ్లు కస్టమర్ల ఖాతాలను టార్గెట్ చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరగా అప్డేట్ చేసుకోవాలని ఆ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. కాగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం యోనో యాప్ ద్వారా డబ్బులు చెల్లింపులు, పలు బ్యాంకింగ్ సేవలు  అందిస్తుంది.

ఎట్టిపరిస్థితిలోను ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్ వర్డ్, ఎం పిన్, ఓటీపీ ఎవరికీ చెప్పొద్దని సూచించింది. అలాగే దీనికి సంబంధించి ఏమైనా ఫోన్ లు వచ్చినా అప్రమతంగా వ్యవహరించాలని సూచించారు.  ఏవైనా అప్డేట్ల పేరుతో లింక్ లు పంపిస్తే క్లిక్ చేయవద్దని ఎస్బీఐ సూచించింది.