ఆ ఫోన్ వాడే వారికి బిగ్ షాక్..జనవరి 4 చివరి రోజు!

Big shock to those who use that phone..January 4 last day!

0
110

బ్లాక్​బెర్రీ ఫోన్ కు జనవరి 4 చివరి రోజు కానుంది. ఆ తరువాత ఈ సంస్థకు సంబంధించిన సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. దీనితో ఈ సంస్థ అందిస్తున్న బ్లాక్​బెర్రీ ఓఎస్​, బ్లాక్​ బెర్రీ ప్లే బుక్​ ఓఎస్​ సేవలు ఇకపై ఆగిపోనున్నాయి.

ప్రస్తుతం బ్లాక్​బెర్రీ వినియోగదారులు ఓఎస్​ 7.1, బీబీ10 ను ఉపయోగిస్తున్నట్లైతే జనవరి 4 నుంచి కనీసం​ ఫోన్ చేయడం, మెసేజ్​లు చేయడం, ఎమర్జెన్సీకాల్స్​ చేయడం లాంటివి సేవలను కూడా వినియోగించుకోలేరని తెలుస్తోంది.

వైఫై, మొబైల్​ డేటాతో ఇంటర్నెట్​ను ఉపయోగించుకోవాలి అనుకుంటే అవి కూడా కొద్దికాలానికి మాత్రమే పరిమితం అవుతాయని లిలిపుటింగ్​ తెలిపింది. బ్లాక్​బెర్రీ అందిస్తున్న బ్లాక్​బెర్రీ లింక్​, బ్లాక్​బెర్రీ డెస్క్​టాప్ మేనేజర్​, బ్లాక్​బెర్రీ ప్రొటెక్ట్​, బ్లాక్​బెర్రీ మెసెంజర్​, బ్లాక్​బెర్రీ బ్లెండ్​ లాంటి సేవలు కూడా త్వరలోనే నిలిచిపోతాయని స్పష్టం చేసింది.

బ్లాక్​బెర్రీ నుంచి గతేడాది విడుదలైన ఏడు అంగుళాల ట్యాబ్లెట్​ బ్లాక్​బెర్రీ ప్లేబుక్​ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. అయితే ఈ ఫోన్​ను ఉపయోగించే వారు తమ డేటాను జాగ్రత్తగా భద్రపరుచుకునేందుకు బ్లాక్​బెర్రీ అధికారిక పేజీలోని ప్రశ్నలు సమాధానాలను ఓ సారి చూడాలని సంస్థ సూచించింది.