బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ఆఫర్‌..రూ. 275కే రూ. 599 ప్లాన్‌ బెనిఫిట్స్‌

0
97

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి వినూత్న బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ. 275కే, రూ. 449తో పాటు రూ. 599 ప్లాన్‌ బెనిఫిట్స్‌ను అందిస్తుంది.

రూ. 449, రూ. 599 బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్స్‌పై ఈ ఆఫర్‌ను అందించనున్నారు. మొదటి 75 రోజుల పాటు ఈ రెండు ప్లాన్లను రూ. 275కే పొందొచ్చు. రూ. 449 ప్లాన్‌పై 30 ఎంబీపీఎస్‌ వేగంతో 3.3 టీబీ నెలవారీ డేటా పొందొచ్చు. డేటా లిమిట్‌ దాటిన తర్వాత ఇంటర్‌నెట్ స్పీడ్‌ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇక రూ. 559 ప్లాన్‌పై 60 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ 3.3 టీబీ డేటాను పొందొచ్చు. లిమిట్‌ దాటిని తర్వాత స్పీడ్‌ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే ఈ ప్లాన్‌ ఆఫర్‌ తొలి 75 రోజులు మాత్రమే వర్తిస్తుంది. అనంతరం ప్లాన్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే రూ. 999 ప్లాన్‌పై కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇదే తరహా ఆఫర్‌ను ప్రకటించింది. అయితే ఇందుకోసం రూ. 775 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 13వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నట్లు సంస్థ తెలిపింది.