బంపరాఫర్..4 నెలలు ఇంటర్నెట్ సేవలు ఫ్రీ..!

Bumper..4 months internet free ..!

0
79

నాలుగు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సేవలు అవును. మీరు చదివింది నిజమే. ఇది కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌, భారత్‌ ఫైబర్‌, డీఎస్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ ఓవర్‌ వైఫై కస్టమర్లకు మాత్రమే. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు నాలుగు నెలల పాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను భారత్‌ ఫైబర్‌, డిజిటల్‌ సబ్‌స్రైబర్‌లైన్‌ కస్టమర్లకు, బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ ఓవర్‌ వైఫై సబ్‌స్క్రైబర్లకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది.

కాగా ఈ ఆఫర్‌ను పొందాలంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓ చిన్న మెలిక పెట్టింది. అదేంటంటే ఈ ఆఫర్‌ను పొందాలంటే 36 నెలల ఇంటర్నెట్‌ ప్లాన్‌ సేవల కోసం ఒకేసారి పేమెంట్‌ చేస్తే అదనంగా మరో నాలుగు నెలలపాటు ఉచిత ఇంటర్నెట్‌ సేవలను పొందవచ్చునని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారులు ఇంటర్నెట్‌ సేవల కోసం 24 నెలల ప్యాకేజ్‌కు ముందుగానే చెల్లిస్తే మరో మూడు నెలల ఉచిత ఇంటర్నెట్‌ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లు 1800003451500 నెంబర్‌కు కాల్‌ చేసి ఈ ఆఫర్‌ను పొందవచ్చును. లేదా దగ్గర్లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎన్‌ కస్టమర్‌ సేవా కేంద్రాన్ని సంప్రదించి కూడా ఆఫర్‌ను పొందవచ్చును.