ఫ్లాష్: సెంచరీ కొట్టిన డీజిల్ ధర..సామాన్యులకు చుక్కలు

0
109

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేదేలే అంటున్నాయి. చమురు సంస్థలు సామాన్యులకు వరుస షాక్‌లు ఇస్తూ వారి నడ్డి విరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై మరో 32 పైసలు, డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పెట్రోల్ సెంచరీ దాటేసి పరుగులు పెడుతుండగా..తాజాగా డీజిల్ కూడా ఆ మార్కును దాటేసింది. వరుసగా ఫ్యుయల్ రేట్లు పెరగడంతో సామాన్య ప్రజలు వాహనాలు బయటకు తీసేందుకు జంకుతున్నారు.

పెరిగిన ధరలను బట్టి.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.103.24, లీటర్ డీజిల్ రూ. 91.77గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.109.25, డీజిల్ రూ .99.55గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ .100.75, డీజిల్ రూ. 96.26గా ఉంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ రేట్ రూ. 107.40, డీజిల్ ధర రూ. 100.13గా ఉంది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా పెట్రోల్ రేట్ 109.77గా, డీజిల్ ధర రూ.102.34గా ఉండటం గమనార్హం.