మామూలుగా మనకు కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తే ఎవరిదో తెలుసుకోవాలని తాపత్రయపడుతుంటాం. మరి తెలియని వ్యక్తులు కాల్ చేసినప్పుడు వారి వివరాలను తెలియజేస్తుంది ట్రూ కాలర్. అందుకే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కాలర్ ఐడీ యాప్ గా నిలిచింది. ఫోన్ రింగ్ అవడానికి ముందే ఎవరు కాల్ చేస్తున్నారో చెప్పేస్తుంది.
అయితే కొన్నిసార్లు కాలర్ పేరును తప్పుగా, ఇబ్బంది కలిగించేలా చూపిస్తుంటుంది. ఇలా మీకు జరిగి ఉంటే.. సరైన చోటుకే వచ్చారు. ఎందుకంటే ఆండ్రాయిడ్, ఐఫోన్ సహా వెబ్సైట్లలో ట్రూకాలర్‌లో మీ పేరును కూడా మార్చుకోవచ్చు.
అదెలాగంటే?
ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేసి.. ఎడమవైపు పై భాగంలో ఉండే ‘హ్యాంబర్గర్ మెనూ’పై (మూడు అడ్డ గీతలు) నొక్కాలి. అప్పుడు.. మీ పేరు పక్కన ఉండే ‘ఎడిట్’ బటన్‌పై (పెన్సిల్ ఐకాన్) క్లిక్ చేయాలి.
ఆ తర్వాతి పేజ్‌లో ట్రూ కాలర్‌లో ఇతరులకు మీ పేరు ఏ విధంగా కనిపించాలని అనుకుంటున్నారో.. ఆ పేరు టైప్ చేసి ‘సేవ్’ చేయండి.
ఇలా చేస్తే సాధారణంగా మీ పేరు వెంటనే మారుతుంది. అయితే అందుకు 24 నుంచి 48 గంటల వరకు సమయం పట్టొచ్చని ట్రూకాలర్ చెబుతుంది.