భారతీయ టెలికాం దిగ్జజం జియో సంస్థ గూగుల్‌తో కలిసి తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ జియో నెక్స్ట్. ఈ ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి పూర్తిగా అందుబాటులోకి వచ్చేసింది. గతేడాది దీపావళికి విడుదలైన ఈ మొబైల్‌ను ఇక మీదట రిలయన్స్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ధరను రూ.6,499గా నిర్ణయించారు. ఇక,ఈజీ ఈఎమ్ఐ లేదా ఫైనాన్స్ కింద ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1999గా ఉంది. తాజాగా ఆఫ్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు.
5.45 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్‌తో వచ్చే ఈ పాకెట్-ఫ్రెండ్లీ ఫోన్.. 2జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజీకి మద్దతిస్తుంది. పైగా మెమరీని 512జీబీ వరకు విస్తరించుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్ ప్రాసెసర్, వెనుకాల 13 ఎంపీ, ముందు 8 ఎంపీ ఆటో ఫోకస్ కెమెరాల, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులోని మరిన్ని ప్రత్యేకతలు.
వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్ట్స్, 12 భాషల్లోకి అనువదించే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ సిమ్‌తో వచ్చే ఈ మొబైల్ సరికొత్త ‘ప్రగతి ఓఎస్’ పై రన్ అవ్వడం విశేషం. ప్రీలోడెడ్ జియో, గూగుల్ యాప్‌లు ఉంటాయి. బ్లూటూత్, వైఫై, హాట్ స్పాట్‌కు సపోర్ట్ చేస్తుంది.