డీ మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్ ఎస్.దమానీ ఆయన గురించి దేశంలో తెలియని వారు ఉండరు.
ఆయన ఆస్తి విలువ 19.2 బిలియన్ డాలర్లు సుమారు రూ. 1.42 లక్షల కోట్లు. డీమార్ట్ రిటైల్ స్టోర్ల ద్వారా ఆయన బిజినెస్ మరింత పెరిగింది. ఈ కరోనా సమయంలో ఆయన బిజినెస్ అంతకంతకూ పెరిగింది. డీ మార్ట్ స్టోర్ల సంఖ్య మిని సిటీల్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు.
ఆయన గురించి చూద్దాం.
రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో ఒక సాధారణ మార్వాడీ కుటుంబంలో 1954 మార్చి 15న పుట్టారు రాధాకిషన్. ఆయనకి ముందు నుంచి వ్యాపారాలు అంటే ఇంట్రస్ట్ ఈ ఆసక్తితో ఆయన ముందు బాల్ బేరింగ్ వ్యాపారం ప్రారంభించారు.
ఆయన తండ్రి మరణించడంతో ఆ వ్యాపారాన్ని వదిలేసి స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టారు.
ఆయన ముందు స్టాక్ మార్కెట్లలో మధ్య, చిన్నతరహా కంపెనీలలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసేవారు.ముందు చిన్న చిన్న కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తూ తన సంపద రెండేళ్లకు పెంచుకున్నారు. హర్షద్ మెహతా దెబ్బతో చిన్న ఇన్వెస్టర్లు కుదేలు అయినా, ఆయన మాత్రం తన తెవివితో బిజినెస్ లో నిలబడ్డారు. ఇప్పుడు దేశంలో ధనవంతుల్లో ఆయన ఒకరిగా నిలిచారు.