ఢమాల్..స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..పతనమైన రూపాయి విలువ

0
72

దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 861.25 పాయింట్లు కోల్పోయి.. 57,972.62 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 246 పాయింట్ల నష్టంతో 17,312.90 వద్ద సెషన్​ను ముగించింది.

ఎస్కార్ట్స్ కుబోటా, కోల్​గేట్​, ఇండియా సిమెంట్​, ఐడీఎఫ్​సీ, బీహెచ్​ఈఎల్​ సంస్థలు లాభపడ్డాయి. ఇన్ఫో ఎడ్జ్​, సిటీ యూనియన్​ బ్యాంక్​, టెక్​మహీంద్రా, మైండ్​ట్రీ, కోఫోర్జ్​ లిమిటెడ్​ కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి.

రూపాయి విలువ..
డాలరుతో రూపాయి మారకపు విలువ 16 పైసలు తగ్గి, 80 రూపాయల వద్ద స్థిరపడింది.