ఈ 5 డేంజర్ యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి

0
90

మన ఫోన్ లో మనకు అవసరమైన వాటిని మాత్రమే వుంచుకుంటాం. ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయితే కొన్ని యాప్స్ ను తీసేస్తాం. అయితే మన ఫోన్ లో ఉన్న అన్ని యాప్స్ సురక్షితం కాదు. అందుకే గూగుల్ ఎప్పటికప్పుడు మాల్ వేర్ యాప్ లను గుర్తిస్తూ వాటి జాబితాను విడుదల చేస్తుంది.

తాజాగా ప్లే స్టోర్‌లో ప్రమాదకరమైన ఐదు మాల్‌వేర్‌ యాప్‌లను గూగుల్ గుర్తించింది. అంతేకాదు వాటిని ప్లే స్టోర్‌ నుండి తొలగించింది కూడా. ఇవి స్పైవేర్‌ యాప్‌లుగా పనిచేస్తూ మొబైల్‌లోని ఇతర యాప్‌ల నుంచి డేటాను తస్కరిస్తున్నాయట. మరి ఈ యాప్ లు మీ మొబైల్‌లో ఉంటే వాటిని వెంటనే అన్‌ ఇన్‌స్టాల్‌ చేసేయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  1. పీఐపీ పిక్‌ కెమెరా ఫొటో ఎడిటర్‌ యాప్‌ ఇమేజ్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌. ఇందులోని మాల్‌వేర్‌ ఫేస్‌బుక్‌ లాగిన్‌ వివరాలను దొంగలిస్తోందట. దీనిని పది లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం.

2. వైల్డ్‌ అండ్​ ఎక్సోటిక్‌ యానిమల్‌ వాల్‌పేపర్ యాప్‌లో మాస్క్వెరేడింగ్ అనే యాడ్‌వేర్ ఉంటుంది. ఇది మొబైల్‌లోని ఇతర యాప్‌ల ఐకాన్‌ను, పేరును మారుస్తుంది. దానివల్ల సమస్యలు వస్తాయి. ఇక ఈ యాప్‌ను 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారట.

3. జోడి హారోస్కోప్‌ – ఫార్చ్యూన్‌ ఫైండర్‌ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోకి ప్రవేశించిన మాల్‌వేర్‌ ఫేస్‌బుక్‌ ఖాతా వివరాలను తస్కరిస్తోంది. దీన్ని కూడా 5 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారట.

4. కెమెరాను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు ‘పీఐపీ కెమెరా 2022’ యాప్‌ను వాడుతుంటారు. ఈ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించగానే అందులోని మాల్‌వేర్‌ ద్వారా ఫేస్‌బుక్‌ సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లకు చేరవేస్తోంది. ఈ యాప్‌ను 50 వేల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం.

5. మ్యాగ్నిఫిషర్‌ ప్లాష్‌లైట్‌ యాప్‌లో వీడియో, స్టాటిక్‌ బ్యానర్‌ యాడ్స్‌ ఎక్కువగా వస్తాయి. సైబర్‌ నేరగాళ్లు వీటి నుంచి యాడ్‌వేర్‌ను ఫోన్‌లోకి పంపి డేటాను సేకరిస్తున్నారు. దీనిని 10 వేల మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు పేర్కొన్నారు.