జియో నెక్ట్స్‌ ఫోన్‌ అమ్మకాలు స్టార్ట్..ఎలా బుక్‌ చేసుకోవాలో తెలుసా?

Do you know how to book Geo Nexts phone sales start?

0
55

రిలయన్స్‌ సంస్థ అత్యంత చవకైన స్మార్ట్‌ ఫోన్‌ పేరుతో జియో ఫోన్‌ నెక్ట్స్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. దీపావళి కానునగా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు కేవలం రూ. 1,999 చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు, మిగిలిన మొత్తాన్ని ఈఎమ్‌ఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ ఫోన్‌ను ఎలా కొనుగోలు చేయాలి.? ఈ ఫోన్‌లోని ఫీచర్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వినియోగదారులు తమకు దగ్గర్లలో ఉన్న జియో రిటైల్‌ స్టోర్‌ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం వినియోగదారులు ముందుగా జియో అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పేరు, ఇంటి చిరునామాతో పాటు ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఇలా చేస్తే ఫోన్‌ అందుబాటులో ఉన్న సమయంలో కంపెనీ మీకు ఓ అలర్ట్‌ మెసేజ్‌ను పంపిస్తుంది. అంతేకాకుండా ఫోన్‌ అందుబాటులో ఉందో లేదో విషయాన్ని వాట్సాప్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

ఇందుకోసం యూజర్లు ముందుగా వాట్సాప్‌లో 7018270182 నెంబర్‌కి ‘Hi’ అని మెసేజ్‌ చేస్తే అందుబాటులోకి రాగానే మెసేజ్‌ వస్తుంది. ఇక జియో ఇండియా వ్యాప్తంగా 30,000 రిటైల్‌ అవుట్‌లెట్స్‌తో జియో ఒప్పందం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ కొత్త ఫోన్‌ రూ. 6,499కి అందుబాటులో ఉంది. ముందుగా ఈ ఫోన్‌ను రూ. 1,999 చెల్లించి మిగతా మొత్తాన్ని ఈఎమ్‌ఐ రూపంలో చెల్లించాలి. వీటితో పాటు యూజర్లు రూ.501 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి.

ఈ ఫోన్‌లో 4.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందిచారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రగతి ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై నడుస్తుంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ క్వాడ్‌ కోర్ ప్రాసెసర్‌ అందించిన ఈ ఫోన్‌లో 2జీబీ ర్యామ్‌, 32 ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంది. ఇక ఫోన్‌ మెమొరీని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరా విషయానికొస్తే 10 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. 3,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యం కలదు.