ఇండియాలో వాడుతున్న కామన్ పాస్​వర్డ్ ఏంటో తెలుసా?

Do you know the common password used in India?

0
91

సాంకేతిక రంగంలో భారత్‌ దూసుకెళ్తున్నా..పాస్‌వర్డ్ విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉన్నట్లు ఓ పరిశోధన తేల్చింది. తేలికగా గుర్తుండేలా సులభమైన పాస్​వర్డ్​ వాడుతుండటం వల్ల ఆన్‌లైన్‌ నేరాల సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు గ్లోబల్ పాస్‌వర్డ్ మేనేజర్ నార్డ్‌పాస్ పలు ఆసక్తికర వివరాలు వెల్లడించింది.

ప్రజలు బలహీనమైన పాస్‌వర్డ్ ఉపయోగిస్తున్నారో, లేదో తెలుసుకొనేందుకు ఈ ఏడాది మళ్లీ ఆ సమయం వచ్చింది. 2021లో నిర్వహించిన పరిశోధన ప్రకారం టాప్‌ 200లో ఉన్న అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లను మీ ముందు ఉంచుతున్నాం. ఆ పాస్‌వర్డ్‌ను ఎన్నిసార్లు ఉపయోగించారు? ఎంత సమయం పడుతుందనేది ఈ జాబితాలో వివరించాం’ అని నార్డ్‌పాస్‌ ఆ జాబితాను ట్విటర్‌లో షేర్ చేసింది.

భారత్‌లో ఎక్కువమంది పాస్‌వర్డ్‌గా ‘password’ అనే పదాన్నే ఉపయోగిస్తున్నారు. అలాగే 12345, 123456, 1234567, 12345678, 123456789, india123, 1234567890, qwerty, abc123ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. వాటిలో india123 మినహా అన్నింటినీ ఒక సెకనులో క్రాక్‌ చేయగలరని పేర్కొంది. india123కి 17 నిమిషాల సమయం పట్టినట్లు చెప్పింది. 50దేశాల్లో 123456, 123456789, 12345 పాస్‌వర్డ్‌లను చాలా కామన్‌గా వాడుతున్నారు. qwerty, password తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది.

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పాస్‌వర్డ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ముంబయి పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. మీమ్స్ ద్వారా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ల ఆవశ్యకతను వివరిస్తున్నారు.