మన తాతల కాలంలో ఇంట్లో అందరూ అరటి ఆకుల్లోనే అన్నం తినేవారు. ఇక పెళ్లి శుభకార్యాలు ఏం జరిగినా అక్కడ అరటి ఆకుల్లోనే విందు భోజనం పెట్టేవారు. కాని రోజులు మారాయి ఇప్పుడు అంతా ప్లాస్టిక్ డిస్పోజబుల్ ప్రొడక్ట్స్ వచ్చాయి. డిఫరెంట్ మోడల్ ప్లేట్స్ వచ్చాయి దీంతో అరటి ఆకులని ఎవరూ వాడటం లేదు. ఏదో పండగలకి మాత్రమే ఈ అరటి ఆకులు వాడుతున్నారు.
అయితే ఇప్పుడు అంతా ఆన్ లైన్ మార్కెట్లోనే ఏది కావాలి అన్నా కోనుక్కుంటున్నాం. పిడకలని ఆన్ లైన్ లో అమ్మడం చూశాం. ఈ మధ్య టెంకాయలు ఆన్ లైన్ లో అమ్ముతున్నారు. అలాగే పువ్వులు పళ్లు కూడా అమ్ముతున్నారు. అంతేకాదు మామిడి ఆకులు కూడా ఆన్ లైన్ లో అమ్ముతున్నారు. అయితే ఈసారి కొన్ని సంస్ధలు అరటి ఆకులు కూడా ఆన్ లైన్ లో అమ్ముతున్నాయి.
గ్రామాల్లో అరటి ఆకులు ఈజీగా దొరుకుతాయి. పట్టణాల్లో ,నగరాల్లో అరటి ఆకులు దొరకడం కష్టం. అందుకే ఇప్పుడు అరటి ఆకులు అమ్ముతున్నాయి కొన్ని ఆన్ లైన్ సంస్ధలు. మరి రేటు ఎంత ఉందో తెలుసా ఐదు అరిటాకులు ధర రూ.50 లట. అయితే చాలా మంది వీటిని ఆర్డర్ చేస్తున్నారు. మరి సిటీల్లో దొరకడం లేదు అందుకే ఈ అవకాశం ఉపయోగించుకుంటున్నాం అంటున్నారు