మన దేశంలో ఏదైనా రూపాయి నుంచి ప్రారంభం అవుతుంది. మరి ఈ రూపాయి ఎప్పటి నుంచి వచ్చింది అనేది మీకు తెలుసా? అసలు ఎవరు ఈ రూపాయి తీసుకువచ్చారు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో ధనవంతుడు అయినా పేదవాడు అయినా ఈ రూపాయి నుంచే ఎదుగుదల గురించి చెబుతారు. ఎవరైనా రూపాయి నుంచి ఇన్ని సంపాదించాం అని చెబుతారు.
మన దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరు చెప్పి వచ్చింది. ఉప్పు పప్పు కాఫి ఇలా అనేక రకాల వస్తువులు ఇక్కడ నుంచి వ్యాపారం నిమిత్తం తీసుకువెళ్లేవారు. 1640 లో మన దేశంలో దాదాపు 23 పరిశ్రమలను స్థాపించి వంద మందికి ఉపాధి కల్పించింది కంపెనీ . 1757 లో ప్లాసీ యుద్దం తర్వాత మన దేశంలో బెంగాల్ నవాబుతో ఒప్పందం కుదుర్చుకుని నాణేలను తయారుచేయడం ప్రారంభించింది. అలా 1757 లో తొలి రూపాయి నాణం జారీ చేశారు.
ఈ నాణేల తయారీ కోసం ముందు సూరత్, బొంబాయి, అహ్మదాబాద్ లోని మింట్ ని ఈస్ట్ ఇండియా కంపెనీ నెలకొల్పింది.
కాని తొలి రూపాయి కాయిన్ మాత్రం కోల్ కత్తాలోని మింట్ లోనే తయారైంది. ఒక్కో మింట్ లో నాణం ఒక్కో విధంగా ఉండేవి. కాని 1835లో అన్నీ నాణాలు ఒకేలా ఉండాలి అని రూల్ తెచ్చారు. దీంతో అన్ని మింట్ లో నాణాలు ఒకేలా తయారు అయ్యాయి.