పాన్ కార్డు ఎక్కడ ఎక్కడ అవసరం అవుతుందో తెలుసా – ఇవి కొనాలంటే పాన్ కార్డ్ ఉండాల్సిందే

Do you know where the PAN card is required?

0
41

పాన్ కార్డు ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు తీసుకుంటున్నారు. ఇక పాన్ కార్డ్ అసలు దేనికి తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ కార్డు బ్యాంకు లావాదేవీల విషయాలలో తప్పకుండా అవసరం. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. మీరు బంగారం రెండు లక్షలు దాటి కొన్నా పాన్ కార్డ్ ఇవ్వాల్సిందే. టూవీలర్ మినహా ఇతర వాహన కొనుగోలు లేదా అమ్మకానికి పాన్ కార్డు ఇవ్వాలి.

మీరు బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు ఇవ్వాలి. ఇక క్రెడిట్ కార్డ్ కావాలి అన్నా పాన్ నెంబర్ ఇవ్వాలి. షేర్ల వ్యాపారం చేయాలి అంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి .అది ఓపెన్ చేయాలి అన్నా పాన్ కార్డ్ కావాలి. మీరు ఏదైనా రెస్టారెంట్ హోటల్ కు వెళ్లి 50 వేలు దాటి పే చేయాలంటే పాన్ కార్డ్ ఇవ్వాల్సిందే.

ఫారిన్ కరెన్సీ 50 వేలు దాటి కొన్నా కచ్చితంగా పాన్ కార్డ్ ఇవ్వాల్సిందే. అలాగే చాలా మంది ఈరోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు, ఇందులో రూ.50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం. ఒక రోజులో రూ.50 వేలకు పైన ట్రాన్సాక్షన్ బ్యాంకులో నిర్వహిస్తే పాన్ కార్డు కావాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు రూ.50 వేలు దాటితే మీరు కచ్చితంగా పాన్ ఇవ్వాలి. మీరు రూ.10 లక్షలకు పైన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సి వస్తే పాన్ తప్పకుండా అవసరమే.