మీ ఫోన్​లో ఛార్జింగ్​ తొందరగా అయిపోతుందా? అయితే ఇలా చేయండి!

Does your phone run out of charging fast?

0
93

ప్రస్తుతం స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. యువ‌కులు, చిన్నారుల నుంచి మొదలు పెద‌వాళ్ల వ‌ర‌కు అంద‌రూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడ‌ల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. చిట్‌చాట్, వీడియో కాలింగ్, గేమింగ్, ఆన్‌లైన్‌ షాపింగ్, ఆఫీస్‌ మీటింగ్ అంటూ రోజంతా స్మార్ట్‌ఫోన్ బిజీగా ఉంటుంది. దీనితో ఫోన్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. బ్యాటరీ బ్యాకప్‌లను వెంటపెట్టుకొని వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. ఛార్జింగ్  ఎక్కువసేపు ఉండాలంటే ఇలా చేయండి.

బ్యాటరీ ఛార్జింగ్‌ ఎక్కువసేపు ఉండేందుకు యాపిల్ చేసే మొదటి సూచన, మీ ఫోన్‌ను వేడి వస్తువులు, అధిక ఉష్ణోగ్రతలకు దూరంగా ఉంచడం. సాధారణంగా 16 డిగ్రీల సెల్సియస్‌ నంచి 22 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు డివైజ్‌ పనితీరుకు అనుకూలమైనవి చెబుతోంది. అందుకే 35 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉంచమని సూచిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బ్యాటరీ సామర్థ్యం దెబ్బతిని, ఛార్జింగ్ ఎక్కువ కాలం ఉండదని యాపిల్ చెబుతోంది.

ఒకవేళ డివైజ్‌ బ్యాటరీ జీరో చేస్తే బ్యాటరీ పూర్తిగా డీప్ డిస్‌ఛార్జ్‌ స్టేట్‌లోకి వెళిపోతుందట. దానివల్ల తిరిగి బ్యాటరీ ఛార్జ్‌ కాకపోవచ్చు. అలానే ఫుల్‌ ఛార్జ్‌తో స్టోర్‌ చేస్తే ఎక్కువ కాలం ఉపయోగించకపోవడం వల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది.

చాలా కాలం తర్వాత డివైజ్‌ను తిరిగి ఉపయోగించాలనుకంటే ఒరిజినల్‌ అడాప్టర్‌తో కనీసం బ్యాటరీని 20 నిమిషాలు ఛార్జ్‌ చేయమని యాపిల్ సూచిస్తుంది.