గాడిద పాలు ఇక్కడ లీటర్ పదివేలు – ఏమిటి అంత స్పెషాలిటీ

Donkey milk rate is ten thousand rupees per liter

0
143

ఆవు పాలు గేదె పాలకు ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే . ఇప్పుడు మొత్తం ప్యాకెట్ పాలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి.
ఇక మేకపాలకు కూడా ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగింది. అలాగే ఇప్పుడు గాడిద పాలకు కూడా ఎనలేని డిమాండ్. ఏకంగా ఆశ్చర్యపోతారు లీటర్ పాల ధర తెలిస్తే? మహారాష్ట్ర ఉమర్గా పట్టణంలో గాడిద పాలకు భలే గిరాకీ ఉంది. లీటరు రూ. 10 వేల వరకు అమ్ముతున్నారు. ఏమిటి ఇంత రేటా అని ఆశ్చర్యంగా ఉందా సో ఈ స్టోరీ చదవండి.

గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలతో సహా ట్రేస్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. ఇక సౌందర్య ఉత్పత్తుల తయారీకి కూడా గాడిద పాలు వాడతారు. గాడిద ప్రతిరోజూ ఒక లీటరు పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో విస్తృతంగా అందుబాటులో లేనప్పటికీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక మీకు తెలుసా ఐరోపా ప్రాంతంలో గాడిద పాలు చాలా ఎక్కువగా తాగుతారు.

త్వరలో హర్యానా హిస్సార్లో గాడిదల పాల డెయిరీని ఎన్ఆర్సీఈ ప్రారంభించనుంది.హలారి జాతి గాడిద నుంచి సేకరించిన పాలతో డెయిరీని ఇక్కడ స్టార్ట్ చేయనున్నారట. ఈ జాతి గాడిదలు గుజరాత్ లో లభిస్తాయట. అందుకే ఈ గాడిద పాలకు అంత డిమాండ్ ఉంది.