Flash News : ఒక్క రూపాయికే ఇయర్ బడ్స్ – మరికొన్ని గంటలు మాత్రమే త్వరపడండి

Ear buds for one rupee-Hurry up just a few more hours

0
116

ఏదైనా కొత్త ప్రొడక్ట్ మార్కెట్లోకి తీసుకువస్తే ప్రమోషన్స్ యాడ్స్ ఏ లెవల్లో చేస్తాయో తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ప్రమోషన్స్ తో పాటు కస్టమర్లకు మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నాయి కంపెనీలు. ఈ కామర్స్ పోర్టల్లో అతి తక్కువ ధరకు అమ్ముతున్నాయి. నేరుగా మన ఇంటికే వస్తున్నాయి. లావా సంస్థ ఒక్క రూపాయికే వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ బంపర్ ఆఫర్ తో టెక్ ప్రియులు దీని కోసం వెయిట్ చేస్తున్నారు.

ఫోన్ల మార్కెట్ నుంచి ఇప్పుడు వైర్ లెస్ ఇయర్ బడ్స్ మార్కెట్ కి లావా ఎంటర్ అయింది. లావా ప్రోబడ్స్ పేరిట తొలి ఇయర్ బడ్స్ ను మార్కెట్ లో లాంచ్ చేస్తోంది. 24వ తేదిన ఆన్ లైన్ లో మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ను మొదలుపెట్టనుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, లావా ఆన్ లైన్ స్టోర్ లలో అందుబాటులోకి తెస్తోంది.
.. ఇక కేవలం ఒక్క రూపాయికే వీటిని సొంతం చేసుకోవచ్చు. కాని అందరికి కాదు కేవలం స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే అని షరతు పెట్టింది. ఇక దీని ఖరీదు రూ.2199 ఉంది. సో ఇక రూపాయికి ఆఫర్ ఇవ్వడంతో చాలా మంది దీని కోసం వెయిట్ చేస్తున్నారు. రెండు పాడ్స్ లు 55 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 25 గంటల పాటు అవి పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది.