రూ.65 వేలకే ఎలక్ట్రిక్ బైక్..పామ్‌స్ప్రింగ్స్ మోటార్స్ ప్రారంభోత్సవం

0
97

ప్రస్తుతం యువత బైక్ లపై మక్కువ పెంచుకుంటున్నారు. పుల్సర్, కేటీఎం, బుల్లెట్ యువత మెచ్చిన బైక్ లు. కానీ వీటిని కొనుగోలు చేయాలంటే లక్షలతో కూడినది. పేద కుటుంబాలు ఇలాంటి బైక్ లు కొనడం కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి తరుణంలో మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైక్ లు తక్కువ ధరకే దొరుకుతున్నాయి.

ఇక తాజాగా హైదరాబాద్ లోని చిల్కూర్ బాలాజీ టెంపుల్ రోడ్డులో పామ్‌స్ప్రింగ్స్ మోటార్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సిల్వ్ లైన్ పవర్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 16 ఎలక్ట్రికల్ టు వీలర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా డా.విద్యా సాగర్ మాట్లాడుతూ..పెట్రోల్, డిజిల్ వెహికిల్స్ ద్వారా పర్యావరణానికి చాలా ముప్పు ఉందని, ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని, ఎలాంటి టూ వీలర్ తీసుకోవాలన్నా రూ.లక్ష పైన ఉన్న సందర్భంలో కేవలం రూ.65,000కే ఎలక్ట్రికల్ వెహికల్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మాజీ రవాణా శాఖ మంత్రి  కె.ఎస్. రత్నం, మాజీ ఎమ్మెల్యే సత్య పానీగ్రహీ, చైర్మన్ సిల్వెలైన్ పవర్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నీలేష్ ధాబ్రే, డైరెక్టర్ సిల్వేలైన్ పవర్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డా. పి. విద్యా సాగర్, ఆంజనేయ ప్రసాద్, మల్లికార్జున్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కొమ్మాలపాటి శ్రీనివాస్ రావు & రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.