మద్యం తాగి కారును నడపడం నేరం..కానీ కారే మద్యం సేవించి రోడ్లపై పరుగులు తీస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నూటికి నూరుశాతం నిజం. స్వయాన ఓ దేశ యువరాజు తన కారు మద్యంతో నడుస్తోందని ప్రకటించారు. రాజసౌధంలో మిగిలిపోయిన వైన్‌ను పోసి ఆస్టోన్ మార్టిన్ కారులో యువరాజు చక్కర్లు కొడుతున్నారు.
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు కార్ల వాడకం పెరుగుతోంది. అయితే బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ (72) మరో అడుగు ముందుకేసి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఆస్టోన్ మార్టిన్ కారును వైన్‌తో నడిపిస్తున్నారు.
బహుమతిగా అందుకున్న ఆస్టోన్ మార్టిన్ కారంటే ప్రిన్స్ చార్లెస్‌కు ఎంతో ఇష్టం. యువరాజు అభిరుచులకు తగ్గట్లుగా ఇంజినీర్లు తీవ్రంగా శ్రమించి..ఈ కారును వైన్‌తో నడిచేలా రీడిజైన్ చేశారు. వారి కృషి ఫలించి ప్రస్తుతం రాజుగారి కారు వైన్‌తో నడుస్తోంది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో మిగిలిపోయిన వైన్‌ను ఈ కారుకు ఇంధనంగా వినియోగిస్తున్నారట.