బడ్జెట్‌పై ఆశలు -దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

0
63

ముంబయి: బడ్జెట్ వేళ దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. బడ్జెట్‌పై ఆశలు, ఆర్థిక సర్వే నివేదిక మదుపర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తున్నాయి. ఉదయం 9:40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 711.04 పాయింట్లు లాభపడి 58,725.21 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 192.00 పాయింట్లు లాభపడి 17,531.85 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.58గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫీ, సన్‌పార్మా, మారుతీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, రిలయన్స్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.