పండగొచ్చేస్తుంది-ఆఫర్లు తెచ్చేస్తుంది..తక్కువ ధరకే ఆ వస్తువులు

0
120

దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట అమెజాన్‌ సేల్‌ నిర్వహించనుండగా.. ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరిట ఫ్లిప్‌కార్ట్‌ ముందుకు రానుంది. ఇందులో వివిధ కంపెనీల మొబైళ్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ను ఫ్లిప్‌కార్ట్‌తో పోటీగా దాదాపు అదే తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి సేల్‌లో ఎస్‌బీఐ కార్డుదారులకు 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఆఫర్ల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ కస్టమర్లకు ఒక రోజు ముందే ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. అమెజాన్‌ తేదీలను ప్రకటించే తేదీలను బట్టి ఫ్లిప్‌కార్ట్‌ తేదీలు మారే అవకాశం ఉంది.

బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌కు సంబంధించి ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ఓ బ్యానర్‌ను సిద్ధం చేసింది. అందులో తేదీల వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, సెప్టెంబర్‌ 23 నుంచి 30 వరకు ఈ సేల్‌ నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇందులో ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఆఫర్ల వివరాలు సేల్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు రివీల్‌ కానున్నాయి.