ఏప్రిల్ నుంచి భారీగా పెరగనున్న గ్యాస్ ధరలు..ఎందుకో తెలుసా?

Gas prices are set to rise sharply from April

0
92

పెట్రోల్, డీజిల్ ధరల తర్వాత ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ నుంచి గ్యాస్ ధరలు పెరగొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల నెత్తిన మళ్లీ గ్యాస్ ధరల పెరుగుదల రూపంలో పిడుగు పడబోతోంది.  దీని వల్ల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర దగ్గరి నుంచి పీఎన్‌జీ, పీఎన్‌జీ, ఎలక్ట్రిసిటీ వంటి వాటి ధరలు కూడా పెరగనున్నాయని తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..కరోనా మహమ్మారి వలన ఎన్నో కష్టాలు వచ్చాయి.  ఇప్పుడిప్పుడే అవి తగ్గుతున్నాయి. దీని వల్ల అంతర్జాతీయంగా ఎనర్జీ డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో సరఫరా మాత్రం పెరగడం లేదు. గ్యాస్ ధరలు దీనితో భారీగా పెరగొచ్చనే అంచనాలు వున్నాయి. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కారణంగా ఇప్పటికే దేశీ పరిశ్రమ ఎల్ఎన్‌జీ దిగుమతుల కోసం అధిక ధరలు చెల్లిస్తోందని నిపుణులు అంటున్నారు.

ఏప్రిల్ నుంచి గ్యాస్ కొరత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరిగేలా కనపడుతోంది. నేచురల్ గ్యాస్ ధరను ఎంఎంబీటీయూకు 2.9 డాలర్ల నుంచి 6 – 7 డాలర్లకు పెరగొచ్చని అంటున్నారు. ఇంచుమించు రెట్టింపు అవ్వచ్చు. డీప్ సీ గ్యాస్ ధర 6.13 డాలర్ల నుంచి 10 డాలర్లకు పెరగొచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటోంది.