జీమెయిల్‌ అకౌంట్ లాక్​ అయిందా? అయితే ఇలా చేయండి

Gmail account locked? Do this though

0
107

ప్రస్తుతం ప్రతి ఒక్కరు జీ-మెయిల్ వాడుతున్నారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడాలన్నా..జీమెయిల్‌ ఖాతా తప్పనిసరి. మరి ఇంత ప్రాధాన్యం కలిగిన జీమెయిల్‌ లాక్‌ కావడం, యాక్సెస్‌ (ఐడీ, పాస్‌వర్డ్‌) కోల్పోవడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

దాదాపు 2 బిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న జీమెయిల్‌ ప్రతి ఫోన్ కి అవసరం. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడాలంటే జీమెయిల్‌ ఖాతా తప్పనిసరి. గూగుల్ ఇతర సేవలు, డేటా, ఫైల్స్‌ యాక్సెస్‌, షేరింగ్‌కూ జీ-మెయిలే కీలకం.  ఒకవేళ మీకు జీమెయిల్‌ ఐడీ గుర్తు లేనట్లయితే ఫోన్‌ నంబర్‌తో సైన్ఇన్‌ అవ్వండి. అలాగే ‘Forgot password’పై క్లిక్ చేసి ఫోన్‌ నంబర్‌తో పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేసుకోవడం సులువైన మార్గం.

జీమెయిల్‌ లాకైన సందర్భాల్లో సైన్‌ఇన్‌ చేయడానికి తరచూ వినియోగించే కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను వాడండి. అందులోనూ మీరు సాధారణంగా వినియోగించే క్రోమ్‌, సఫారీ బ్రౌజర్‌ను ఉపయోగించండి. జీమెయిల్‌ లాక్‌ కావడం కంటే ముందే ముఖ్యంగా మేనేజ్‌ గూగుల్‌ ఖాతాలోకి వెళ్లి సెక్యూరిటీలో రికవరీ ఇమెయిల్‌, ఫోన్‌ నంబర్‌ సెట్‌ చేసుకోవడం మేలు. తద్వారా పాస్‌వర్డ్‌ లాగిన్‌కు సంబంధించిన ఓటీపీ వివరాలను గూగుల్‌ రికవరీ ఇమెయిల్‌, నంబర్‌కు పంపే అవకాశం ఉంటుంది.