బంగారం ధర ఈనెలలో కాస్త పెరుగుదల నమోదు చేసింది. అయితే గత రెండు రోజులుగా చూస్తే 5 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. మరి నేడు బంగారం ధర బులియన్ మార్కెట్లో ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక లాక్ డౌన్ సడలింపులతో షాపులు తీయడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గింది. రూ.49,970కు చేరింది.అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా. రూ.100 తగ్గుదలతో రూ.45,800కి తగ్గింది. ఇక బంగారం నిన్నటితో పోలిస్తే తగ్గుదల నమోదు చేసిందనే చెప్పాలి.
బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగింది. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.76,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. అయితే వచ్చే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే సూచనలు ఉన్నాయంటున్నారు బులియన్ వ్యాపారులు.