బంగారం మరింత ప్రియం..ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..

0
95

బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు పెరిగాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధర ప్రతిరోజూ మారుతుంటుంది. నేటి బంగారం ధర వివరాలు ఇలా..

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.600 పెరిగింది. అయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.200 పెరిగి రూ.45,100కు చేరింది.

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.200 పెరిగి రూ.48,980గా నమోదైంది. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.65,600గా ఉంది.