క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజరాత్ తో పాటు లక్నో రెండు ఫ్రొంచైజీలు ఆడబోతున్నాయి. మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. గత సీజన్లో ఛాంపియన్స్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్‌గా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మరికొద్ది గంటల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమవుతోంది.
తాజాగా జియో రీచార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చి ఐపీఎల్ లవర్స్ కు శుభవార్త చెప్పింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వీలుగా రిలయన్స్ జియో ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్‌ను పరిచయం చేసింది. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌లలో ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వీలుగా జియో రీచార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది.
జియో రూ. 555 పేరుతో కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. దీంతో వినియోగదారులు 55 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను పొందుతారు. అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
రూ. 499 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ వరకు డేటాను పొందొచ్చు. అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
రూ. 799, రూ. 1,006, రూ. 3,119 ప్లాన్స్‌తో యూజర్లు రోజుకు 2 జీబీ డేటాను పొందే అవకాశం ఉంది. అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం ఇచ్చారు.
ఇక రూ. 2999 ప్లాన్‌తో ఏడాది పాటు రోజుకు 2.5 జీబీతో పాటు, డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
రూ. 601 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటా అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
రూ. 1499 రీచార్జ్ ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటాతో పాటు ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తారు.
రూ. 4,199 రీచార్జ్‌తో యూజర్లకు రోజుకు 3 జీబీ డేటాతో పాటు ఏడాదికి గాను డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ పొందొచ్చు.