మన దేశంలో కోట్లాది కుటుంబాలు గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు. అయితే ఈ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ సేవలను వినియోగదారులకు అందించనున్నాయి.
గ్యాస్ సిలిండర్ వాడే వారు వారికి నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.ఉదాహరణకు మీ నగరంలో నాలుగు ఐదుగ్యాస్ ఏజెన్సీ డీలర్లు ఉండవచ్చు. అయితే మీకు నచ్చిన డీలర్ నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఎవరి సర్వీస్ ఎలా ఉంది అనేది రేటింగ్ ఇవ్వచ్చు.
ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వీసులను పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించినట్లు పెట్రోలియం శాఖ తెలిపింది. ఛండీఘర్, కోయంబత్తూరు, గురుగావ్, రాంచీలలో ఇప్పటికే దీనిని ప్రారంభిచారు. దీనిపై వచ్చే రెస్పాన్స్ బట్టీ దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. ఇక గ్యాస్ కావాలి అని అనుకునేవారు మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక ఎవరు వేగంగా డోర్ డెలివరీ చేస్తున్నారు, ఎవరి సర్వీస్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది రేటింగ్ ద్వారా.