ఈ సీజన్లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఐతే మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనే వారికి ఇది శుభవార్తే. కాగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 260 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50, 180 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 180 గా ఉంది.
ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 180 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46, 000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50, 180 గా ఉంది.
బంగారం ధరలు ఇలా ఉండగా మొన్న వెండి ధరల్లో భారీ తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర ప్రస్తుతం స్థిరంగానే రూ. 70, 000 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి.