పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ …స్థిరంగా బంగారం ధ‌ర‌లు

0
96

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో బంగారం ధరలుకొండెక్కిన సంగతి తెలిసిందే. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఇప్పుడు రెండు రోజుల నుంచి నిలకడగా ఉన్నాయి. వెండి ధ‌ర‌లు కూడా వ‌ర‌స‌గా రెండో రోజు తగ్గాయి.

నేటి బంగారం ధరల వివరాలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ  ప్ర‌తి 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు రూ. 47,800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 52,140 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గిపోయాయి. కేజీ వెండి ధర ప్ర‌తి కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 70,700 గా ఉంది.