ప‌బ్‌జీ ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్‌..ఇండియాలో గేమ్ లాంచ్‌ ఎప్పుడంటే?

Good news for puby lovers..when will the game launch in India?

0
106

ప‌బ్‌జీ గేమ్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వాళ్లు ఉండ‌రు. ఆ గేమ్‌కు యూత్ ఎలా అతుక్కుపోతుందో అంద‌రికీ తెలిసిందే. చైనా యాప్ కావడం వ‌ల్ల ఆ గేమ్‌ను ఇండియాలో బ్యాన్ చేశారు. దీంతో ప‌బ్‌జీ ల‌వ‌ర్స్ ఒక్క‌సారిగా బావురుమ‌న్నారు. ఆత‌ర్వాత దేశీయ యాప్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ)ని లాంచ్ చేశారు. బీజీఎంఐ గేమ్ కూడా అచ్చం ప‌బ్‌జీ లాగానే ఉన్న‌ప్ప‌టికీ.. అస‌లైన ప‌బ్‌జీ గేమ్ ఆట‌ను ఆస్వాదించాల‌నుకునే వారికి ప‌బ్‌జీ గేమ్ రూప‌క‌ర్త క్రాఫ్ట‌న్ గుడ్ న్యూస్ చెప్పింది.

ప‌బ్‌జీ న్యూ స్టేట్ పేరుతో మ‌రో గేమ్‌ను ఇండియాలో లాంచ్ చేయ‌బోతోంది. నవంబ‌ర్ 11న ఈ గేమ్‌ను ఇండియాతో పాటు మ‌రో 200 దేశాల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వ‌ర్ష‌న్ల‌లో ఈ గేమ్ విడుద‌ల కానుంది.అక్టోబ‌ర్ 29 నుంచి 30 వ‌ర‌కు 28 దేశాల్లో ఈ గేమ్‌కు టెక్నిక‌ల్ టెస్ట్ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ గేమ్‌ను 17 భాష‌ల్లో ఆడొచ్చు. 28 దేశాల్లో ఫైన‌ల్ టెక్నిక‌ల్ టెస్ట్ జ‌ర‌గ‌నుంది. అందులో ఇండియా లేదు. ఈ కొత్త గేమ్‌లో నెక్స్ట్ జ‌న‌రేష‌న్ బ్యాటిల్ రాయ‌లె ఎక్స్‌పీరియెన్స్‌ను పొందొచ్చు. స‌రికొత్త రెండ‌రింగ్ టెక్నాల‌జీ, కొత్త గ‌న్‌ప్లే సిస్ట‌మ్ ఈ గేమ్‌లో ఉంటాయి. పబ్‌జీ గేమ్‌లోని ఫీచ‌ర్ల‌ను తీసుకొనే ఈ గేమ్‌ను రూపొందించామ‌ని.. ఈ గేమ్ ప్ర‌పంచ మార్కెట్‌లో త‌న స‌త్తా చాటుతుంద‌ని క్రాఫ్ట‌న్ సంస్థ సీఈవో కిమ్ వెల్ల‌డించారు.