SBI కస్టమర్లకు గుడ్ న్యూస్..త్వరలో వాట్సప్ లో..

0
90

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంది. ఇప్పటికే కస్టమర్లకు వీలైనన్ని సౌకర్యాలు ఆన్ లైన్ లోనే ఉండేలా చేస్తూ సేవలను విస్తరిస్తుంది. తాజాగా ఎస్బీఐ మరో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో 45 కోట్లకు పైగా కస్టమర్లకు వేగంగా సేవలు అందనున్నాయి.

ఎస్‌బీఐ త్వరలో వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందించబోతోంది. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా తెలిపారు. కాగా ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు వాట్సప్ ద్వారా బ్యాకింగ్ సేవల్ని అందిస్తున్నాయి.

పలు బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేందుకు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సప్ సేవల్ని ఉపయోగించుకోనుంది ఎస్బీఐ. అయితే ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న విషయం ప్రస్తుతానికి తెలియలేదు. ఎస్‌బీఐ కార్డ్ వాట్సప్ కనెక్ట్ సర్వీస్‌ను గతంలోనే ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లు తమ అకౌంట్ వివరాలు, రివార్డ్ పాయింట్స్, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ లాంటి సేవలన్నీ పొందొచ్చు. వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 08080945040 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. రిజిస్టర్ చేసిన తర్వాత వాట్సప్‌లో 9004022022 నెంబర్‌కు OPTIN అని టైప్ చేసి మెసేజ్ పంపాలి.