యువతకు శుభవార్త..భారీగా నియామకాల జోరు..!

Good news for the youth..heavy appointments ..!

0
92

ఐటీ రంగం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఐటీ కంపెనీల ఆదాయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఇంటి నుంచే పని విధానం అమలు అవుతుండటం వల్ల ఖర్చులు తగ్గడం కూడా వీటికి కలిసొస్తోంది. నియామకాల విషయంలోనూ సంస్థలు జోరు కనబరుస్తున్నాయి. దేశీయంగా యువ ఉద్యోగుల నియామకాల్లో ఐటీ రంగం ముందుస్థానంలో నిలుస్తోంది.

దేశీయంగా యువ ఉద్యోగుల నియామకాల్లో ఐటీ రంగం ముందుస్థానంలో నిలుస్తోంది. కొవిడ్‌-19 కారణంగా మొదలైన ఇంటి నుంచే పని విధానంతో ఖర్చులు తగ్గడం కూడా వీటికి కలిసొస్తోంది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో కంపెనీలు భారీగా ఆదాయ వృద్ధిని నమోదు చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

2021-22 సెప్టెంబరు త్రైమాసికంలో మొత్తం ఐటీ రంగం బలమైన ఆదాయ వృద్ధి సాధించింది. త్రైమాసిక ఆదాయం, మార్జిన్‌ల విస్తరణ పరంగా అగ్రగామి కంపెనీలకు ధీటుగా ద్వితీయ శ్రేణి కంపెనీలు రాణించాయి. క్లౌడ్‌, డేటా అనలిటిక్స్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధ వంటి విభాగాలకు గిరాకీ స్థిరంగా పెరుగుతూ వస్తోంది.

చిన్న ఐటీ కంపెనీలు సైతం కొత్త టెక్నాలజీలపై దృష్టి పెట్టడంతో భారత ఐటీ కంపెనీల వృద్ధి జోరు కొనసాగుతుందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్‌ఎస్‌ఐ రంగం కీలకం కానుందని భావిస్తున్నారు. భారత ఐటీ సేవలకు ఉన్న గిరాకీతో 2022-23 మరో బలమైన ఏడాది కానుందని అంటున్నారు.