వాట్సప్ వాడే వారికి గుడ్ న్యూస్..ఇక వెబ్‌లోనూ..

Good news for WhatsApp users..and now on the web ..

0
111

ఈ నెల ప్రారంభంలో వాట్సప్ వినియోగదారులకు మరింత రక్షణ కోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఉన్న వాట్సప్..“మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్” అనే ఫీచర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు WhatsApp బీటా కోసం ఇప్పటికే అందుబాటులో ఉంది.

WABetaInfo తాజా నివేదిక ప్రకారం, వాట్సప్ ఇతర వినియోగదారులకు కూడా ఈ ఫీచర్‌ను అందించేందుకు సిద్ధమైంది. కొత్త వెర్షన్ 2.2146.5తో ఈ ఫీచర్‌ను తాజాగా వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని నివేదిక వెల్లడించింది.

ఇన్‌స్టంట్-మెసేజింగ్ యాప్‌లోని ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్‌ను ఎవరు చూడాలో నిర్ణయించుకోవచ్చు. దీంతో యూజర్లకు సంబంధించిన డేటాకు మరింత రక్షణ దొరకనుందని కంపెనీ వెల్లడించింది. ప్రైవసీ సెట్టింగ్‌ల కింద ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. యాప్‌లో ఇప్పటికే మూడు ఆఫ్షన్‌లను అందించింది. కొత్త ఫీచర్‌తో, వినియోగదారుల ప్రొఫైల్ ఫోటో, స్టేటస్‌లను వేరే యూజర్లు చూడకుండా నియంత్రించుకోవచ్చు.