వాట్సప్ వాడే వారికి గుడ్ న్యూస్..త్వరలో అందుబాటులోకి ఆ ఫీచర్..

0
146

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. దీనితో యూజర్లు భారీగా పెరిగిపోతున్నారు. ఫోన్ వున్న ప్రతి ఒక్కరు వాట్సప్ ను వాడుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇక తాజాగా వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఇప్పటివరకు ఎవరికైనా మనం మెసేజ్ చేశాక అందులో ఉన్న మిస్టేక్ ను సరి చేసుకోలేం. డిలీట్ ఫర్ every one అని తీసేయాల్సిందే. లేదంటే మనం చేసిన మెసేజ్ కు అటాచ్ గా మరో మెసేజ్ చేయాలి. కానీ ఇకపై మనం చేసిన మెసేజ్ ను మనమే సరి చేయొచ్చు. అందుకోసం వాట్సప్ కొత్త ఫీచర్ ను తీసుకొస్తుంది.

దాని పేరే ‘ఎడిట్ మెస్సేజ్ ఫీచర్’. దీని ద్వారా మనం చేసిన మెసేజ్ ను ఎడిట్ చేయొచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. అయితే మనం చేసిన మెసేజ్ ను ఎడిట్ చేసినట్టు అవతలి వ్యక్తికి తెలిసేలా ఓ లేబుల్ కనిపించేలా సెట్ చేయనున్నారు. ఈ ఫీచర్ తో ఇక మనమే మెసేజ్ ను ఎడిట్ చేసుకోవచ్చు.