మహిళలకు శుభవార్త..తగ్గిన బంగారం, వెండి ధరలు

0
95

బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 51,930 గా నమోదు కాగా…అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 47, 600 గా ప‌లుకుతుంది.

ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గిపోయాయి. దీంతో కేజీ వెండి ధర.. రూ. 200 తగ్గి రూ. 61, 100 గా నమోదు అయింది.