గూగుల్‌ సంచలన నిర్ణయం..ఇలా చేయకుంటే ఉద్యోగం ఉఫ్..!

Google's sensational decision.

0
102

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ గూగుల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని ప్రకటించింది. అలాంటి ఉద్యోగులకు జీతాల్లో కోతలు, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.

డిసెంబరు 3లోగా ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను ప్రకటించి, అందుకు సంబంధించి సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ఒకవేళ వైద్యపరమైన లేదా మతపరమైన కారణాలతో టీకా నుంచి మినహాయింపు కావాలనుకుంటే దానికోసం దరఖాస్తు చేసుకోవాలి” అని గూగుల్ ఆ మెమోలో సూచించింది. ఆ తేదీలోగా వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను అప్‌లోడ్‌ చేయని ఉద్యోగులు, ఇంకా టీకా తీసుకోని వారు, మినహాయింపునకు అనుమతి రాని సిబ్బందిని ప్రస్తుతం గూగుల్‌ కాంటాక్ట్‌ చేస్తోంది. వారందరికీ చివరి అవకాశం కల్పిస్తున్నట్లు గూగుల్‌ ఆ మెమోలో పేర్కొంది.

ఇటీవల చాలా టెక్‌ కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి ఆఫీసులకు రప్పిస్తుండగా గూగుల్‌ మాత్రం ఇంకా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌నే కొనసాగిస్తోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా మరికొద్ది రోజులు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించింది. అయితే వ్యాక్సిన్‌ పాలసీని మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.