శుభ ఘడియలు షురూ..ఈ సీజన్ లో ఏకంగా 40 లక్షల లగ్గాలు!

0
116

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి ముఖ్యమైన ఘట్టం. పెళ్ళికి ముందు వాళ్ళకు నచ్చిన భాగ్యస్వామిని ఎంచుకొని జీవితాంతం వాళ్ళతో కలిసివుండడమే పెళ్ళి. ఇంకా కొన్ని రోజుల్లో పెళ్ళిల్ల సీజన్ ప్రారంభమవుతుంది.

అంటే అర్ధం ఊళ్ళల్లో సంబరాలు వెల్లివిరవడమే. ఈ వెడ్డింగ్ సెక్టార్ వల్ల అన్ ఆర్గనైజ్డ్ వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. అయితే ఈ ఏడాది లక్షల్లో పెళ్లిళ్లు జరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ వెడ్డింగ్ సీజన్‌‌‌‌లో ఏకంగా 40 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని చెబుతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ మధ్య నుంచి జులై మొదటి వారం వరకు చూసుకుంటే ఏకంగా రూ. 5 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని వ్యాపారులు అంచనావేస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే మూడు లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని, ఈ ఒక్క రాష్ట్రంలోనే రూ. లక్ష కోట్ల బిజినెస్ జరుగుతుందని  అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 43 రోజుల వరకు పెళ్లిళ్ల సీజన్ కొనసాగనుంది.