టాటా సన్స్ కీలక నిర్ణయం..పగ్గాలు ఆయనకే!

0
95

టాటా సన్స్ ఛైర్మన్​గా ఎన్ చంద్రశేఖరన్ మరోసారి నియామకం అయ్యారు. ఐదేళ్ల కాలానికి ఆయన్ను ఛైర్మన్​గా నియమిస్తున్నట్లు టాటా సన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఛైర్మన్​గా చంద్రశేఖరన్ పదవీ కాలం ఫిబ్రవరి 20తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన కాంట్రాక్టును పొడిగిస్తున్నట్లు తాజాగా సంస్థ ప్రకటించింది.

టాటా-మిస్త్రీ కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరే వ్యక్తి ఆ సంస్థ ఛైర్మన్​గా ఉండటం చంద్రశేఖరన్​తోనే ప్రారంభమైంది. బోర్డు మెంబర్ల మద్దతుతో రెండోసారి ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో బోర్డు సభ్యులంతా ఆయన పనితీరును సమీక్షించి, ఛైర్మన్​గా కొనసాగించాలని నిర్ణయించారని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు ఎయిర్ ఇండియాను 68 ఏళ్ల క్రితం టాటా సన్స్ నుంచి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే సంస్ధకు దాన్ని విక్రయించేసింది. ఈరోజు ఎయిర్ ఇండియా బిడ్ టాటా సన్స్ గెలుచుకుంది. టాటా సన్స్ రూ. 18,000 కోట్లకు బిడ్డింగ్ ద్వారా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో వాటాలను కొనుగోలు చేసింది.