రూ.500 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..

0
96

ప్రముఖ టెలికం దిగ్గజాలు తమ యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడూ సరికొత్త ప్లాన్లను అందిస్తున్నాయి. అందులో ప్రీపెయిడ్ ప్లాన్లపై ప్రత్యేకమైన ఆఫర్లతో అందిస్తున్నాయి. దేశీయ టెలికం దిగ్గజం జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ లో రూ. 500లోపు అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి.

రిలయన్స్ Jio నుంచి రూ. 479 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 SMSలను పొందవచ్చు. 1.5GB డెయిలీ డేటా అందిస్తుంది. అంటే యూజర్లు నెలవారీ ప్రాతిపదికన మొత్తం 84GB డేటాను పొందవచ్చు. Reliance Jio ప్లాన్లలో 2 నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 500 ధర పరిధిలో 2GB రోజువారీ డేటాతో రీఛార్జ్ ప్లాన్ లేదు. రూ. 479 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే.. 56 రోజుల పాటు వ్యాలిడిటీ పొందవచ్చు. JioTV యాప్, JioCinema యాప్‌కి ఫ్రీగా యాక్సెస్ పొందవచ్చు.

భారతీ Airtel కూడా జియో లాంటి ప్లాన్‌ను అందిస్తుంది. కానీ Reliance Jio కన్నా ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుంది. రూ. 479 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఉంది. 1.5GB రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ.100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. అపోలోకి మూడు నెలల ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇతర బెనిఫిట్స్ Wynk Music యాప్, HelloTunesకి ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

Vi (వోడాఫోన్ ఐడియా) బెనిఫిట్స్ రూ. 479 ప్రీపెయిడ్ ప్యాక్‌తో వచ్చింది. 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. 12:00AM నుంచి 6:00AM వరకు అన్ లిమిటెడ్ డేటా, ఫ్రీగా నైట్ డేటాను పొందవచ్చు. వారపు రోజుల డేటా కూడా శనివారం-ఆదివారం వరకు ఫార్వార్డ్ అవుతుంది. అదనంగా.. Vodafone ప్రతి నెలా 2GB వరకు బ్యాకప్ డేటాను అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు.