నవంబర్‌లో వచ్చే కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..

Here are the new smartphones coming in November

0
83

మొబైల్‌ ప్రియులను అలరించేందుకు మరిన్ని స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. గత పది నెలల్లో అదిరిపోయే ఫోన్లు రిలీజ్‌ అయ్యాయి. బేసిక్‌, బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌, ఫ్లాగ్‌షిప్‌ ఇలా వివిధ విభాగాల్లో వచ్చిన స్మార్ట్‌ ఫోన్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఒక రేంజ్‌ అనుకుంటే.. వాటిని మించి మరిన్ని ప్రత్యేకతలతో నవంబర్‌ నెలలో కొత్త మొబైల్స్‌  మార్కెట్‌లోకి సందడి చేయనున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..

భారత్‌లో రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్లు వస్తున్నాయంటే చాలు..ఆ ఫోన్ల ప్రత్యేకతలు తెలుసుకొని తీరాల్సిందే అన్నట్టుగా ఎదురుచూస్తుంటారు టెక్‌ గురూలు. అంతే స్పీడ్‌లో నచ్చితే కొనేస్తారు కూడా. ఈసారి రెడ్‌మీ నోట్‌ సిరీస్‌ నుంచి మూడు కొత్త ఫోన్లు (రెడ్‌మీ నోట్‌ 11, నోట్ 11 ప్రో, నోట్‌ 11 ప్రో ప్లస్‌) రాబోతున్నాయి.

నోట్‌ 11 సిరీస్‌ ఫోన్లన్నీ క్వాడ్‌ కెమెరాతో, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంటాయి. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సల్స్‌ ఉంటుంది. 5జీ కనెక్టివిటీతో పాటు బ్యాటరీ 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తాయి. ఈ ఫోన్లు చైనాలో అక్టోబర్‌ 28న విడుదల చేస్తుండగా..భారత్‌లో నవంబర్‌ చివర్లో రానున్నట్లు తెలుస్తోంది. వీటి ధర ₹14,000 నుంచి ₹25,700 వరకు ఉంటుందని అంచనా.

షావోమి త్వరలో మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. షావోమి 11టీ పేరుతో తీసుకొస్తున్న ఈ మోడల్‌ను రెండు వేరియంట్లలో పరిచయం చేయనుంది.

వన్‌ప్లస్‌ నుంచి ఈ సారి 9RT ఫోన్‌ సందడి చేయనుంది. ఈ ఫోన్‌ ధర ₹39వేల నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్‌, ఒప్పొ, వివో నుంచి నవంబర్‌ నెలలో కొత్తగా ఎలాంటి ఫోన్లూ రావడం లేదని సమాచారం. మైక్రోమాక్స్‌, లావా నుంచి కొత్త ఫోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలుస్తాయి.