ఈ ప్రాంతంలో ఇళ్లు కేవలం 12 రూపాయలే – ప్రపంచంలోనే చవక

House Cost 12 Rupees Only

0
111

చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలి అని కోరిక ఉంటుంది. సొంత ఇంటి కల మనదేశం వారికే కాదు, ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. రెండు సెంట్లు సొంత జాగా ఉన్నా అక్కడ ఇళ్లు కట్టుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.అయితే కొన్ని గ్రామాలు చిన్న చిన్న పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. ఎందుకు ఇలా ప్రజలు ఈ పట్టణాలు ఖాళీ చేస్తున్నారు అంటే, ఇక్కడ సౌకర్యాలు లేవంటూ ఖాళీ చేస్తున్నారు జనం. అలాంటి ప్రాంతమే ఇది కూడా.

కానీ ఈ ప్రాంతానికి మళ్లీ ప్రజలు రావాలి అని ప్రభుత్వం ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది . ఇక్కడ ఇళ్లను కేవలం రూ.12 లకే విక్రయించడానికి రెడీ అయ్యారు. క్రొయేషియా దేశంలో లెగ్రాడ్ అనే పట్టణం ప్రజలు లేక వెలవెలబోతోంది. ఇక్కడ ఈ 60 ఏళ్లల్లో జనాభా వేలల్లో తగ్గిపోయింది. జనాన్ని తిరిగి రప్పించడానికి అత్యంత చవకగా ఇళ్లు విక్రయిస్తోంది ప్రభుత్వం. లెగ్రాడ్ లో ఇళ్లు కేవలంరూ. 12 కే ఇస్తున్నారు. సుమారు 17 ఇళ్లు ఇలా ఇవ్వడం జరిగింది.

కాని ఇలా ఇళ్లు కొన్నవారికి కచ్చితంగా కొన్ని రూల్స్ పెట్టింది సర్కార్ . 40 ఏళ్ళు లోపు వయసు, కనీసం ఇక్కడ 15 ఏళ్ళు నివసిస్తామనే హామీ పత్రం ఇవ్వాలి. వారికి మాత్రమే ఇళ్లు ఇస్తారు. మొత్తానికి చాలా మంది ఇళ్లు లేని వారు ఇక్కడ ఇంటికోసం అప్లై చేసుకుంటున్నారు.