ఇతనిది మాములు తెలివి కాదు – క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను నగదుగా మార్చి ఎన్ని కోట్లు సంపాదించాడంటే

How many quotes are earned by converting credit card reward points into cash?

0
77

ఈ రోజుల్లో చాలా మంది డెబిట్ , క్రెడిట్ కార్డులు, ఆన్ లైన్ ట్రాన్ సెక్షన్స్ చేస్తున్నారు. ఇక చెల్లింపులు ఈ మధ్య ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి.ఇలా చెల్లింపులు చేసే సమయంలో రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు కొందరు. ఇలా వందల నుంచి వేలు సంపాదించే వారు ఉంటారు. అయితే ఏకంగా ఈ రివార్డ్ పాయింట్లతో ఏకంగా కోటీశ్వరుడయ్యాడు ఓ వ్యక్తి.

అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త కాన్ స్టాంటిన్ ఆంకీవ్ క్రెడిట్ కార్డు ఎక్కువ వాడతాడు. ఈ వినియోగంలో లభించే రివార్డు పాయింట్లు డబ్బులుగా మార్చుకున్నాడు. ఇలా రివార్డు పాయింట్లు ఆదా చేసి ఏకంగా రూ .2 కోట్ల 17 లక్షల వరకు సంపాదించాడు. 2009 నుంచి ఇదొక అలవాటుగా మార్చుకున్నాడు.

ముందుగా తన క్రెడిట్ కార్డు నుండి పెద్ద సంఖ్యలో బహుమతి కార్డులను కొనడం చేస్తాడు. తర్వాత దానిని ఎన్కాష్ చేస్తాడు. అతను ఈ డబ్బును తిరిగి తన బ్యాంకు ఖాతాలో జమ చేసి, క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించేవాడు. ఇలా దాదాపు 12 ఏళ్లుగా చేసి 2 కోట్లు సంపాదించాడు. చివరకు ఐటీ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో ఇది కోర్టుకు వెళ్లడంతో అతనికి వచ్చిన డిస్కౌంట్లు – రివార్డులు వినియోగదారుల ఆదాయాలు కాదని , అతని తరపున లాయర్ వాదించాడు. అయితే రివార్డులు తగ్గింపు. బహుమతి కార్డును తిరిగి నగదుగా మార్చాడు కాబట్టి ఆదాయపు పన్ను చెల్లించాలని తీర్పు ఇచ్చారు.