ఆగని పెట్రో బాదుడు..లీటరు పెట్రోల్ ఎంతంటే?

How much is a liter of petrol?

0
96

దేశంలో పెట్రో​ ధరల బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు శనివారం చమురు సంస్థలు తెలిపాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరగ్గా.. డీజిల్​పై 35 పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.103.84కు చేరగా..డీజిల్​ ధర రూ.92.48కి పెరిగింది.

హైదరాబాద్​లో పెట్రోల్ లీటర్ ధర 31 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.107.98కి చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు పెరిగి..లీటర్​ రూ.100.86కు చేరింది. విశాఖపట్నంలో 30 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.108.85కు చేరుకుంది. డీజిల్​పై 37 పైసలు పెరిగి.. రూ.101.2కు చేరింది.