ఏటీఎం ఛార్జీల మోత..ఎప్పటి నుండి అంటే?

How much is the amount of ATM charges?

0
160

కొత్త ఏడాది నుండి ఏటీఎం ఛార్జీలు మోత తప్పేలా లేదు. జనవరి 1వ తేదీ నుంచి బ్యాంకింగ్‌ రంగ సేవల్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏటీఎంల నుంచి పరిమితికి మించి నగదు విత్‌డ్రా చేస్తే అధిక ఛార్జీలు విధించనున్నాయి బ్యాంక్​లు.

పరిమితికి మించిన నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీలపై 2022 జనవరి నుంచి ఛార్జీలు పెంచుకోవచ్చని గత జూన్‌లోనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు అనుమతి మంజూరు చేసింది. దానికి అనుగుణంగానే యాక్సిస్‌ బ్యాంకు నగదు లావాదేవీలపై ఛార్జీలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

వినియోగదార్లు తమ ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అదనంగా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మెట్రో కేంద్రాల్లో 3, మెట్రోయేతర కేంద్రాల్లో 5 ఉచిత లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు ఉంది. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు పెంచుకునేందుకూ ఆర్‌బీఐ ఆమోదించిన నేపథ్యంలో, ఆర్థిక లావాదేవీలపై రుసుమును రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు గత ఆగస్టు నుంచే బ్యాంకులు అమల్లోకి తీసుకొచ్చాయి.