ఇండియన్ మార్కెట్లోకి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు

Hybrid electric car into the Indian market

0
97

భారత వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనలను మార్కెట్లోకి తీసుకొనిరావడం కోసం ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదు. తాజాగా మరోక కంపెనీ తన ఎలక్ట్రిక్ ట్యాక్సీ కారును మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అయ్యింది.

ప్రముఖ లండన్ ఈవి కంపెనీ లిమిటెడ్ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ టిఎక్స్ కారును ఇండియాలో ప్రవేశపెట్టడం కోసం సిద్దం అవుతున్నట్లు ప్రకటించింది. ఆటోమేకర్ న్యూఢిల్లీలో కొత్త డీలర్ షిప్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.

ఈ లండన్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ(ఎల్ఈవీసీ), ఎక్స్ క్లూజివ్ మోటార్స్ లిమిటెడ్ తో భాగస్వామ్యాన్ని ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలో ‘ఉపాధి అవకాశాలు’ కూడా లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ కారును అల్యూమినియం చేత తయారు చేస్తున్నారు. ఇది ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. దీనిలో వోల్వో సోర్స్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది.

ఈ 148 బిహెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్ చార్జ్ చేసేందుకు ఇందులో 33 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ట్యాక్సీ కారును ఒకసారి చార్జ్ చేస్తే 510 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని ఎల్ఈవీసీ పేర్కొంది. ఈ కారు ఫుల్ ఎలక్ట్రిక్ మోడ్ లో నడుస్తుంది. అలాగే, బ్యాటరీ అయిపోయినప్పుడు పెట్రోల్ ఇంజిన్ చేత నడుస్తుంది.