ఈ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయా అయితే 20 లక్షలు మీ సొంతం

If you have these coins then your will get 20 lakhs

0
94

ఈ రోజుల్లో రూపాయికి ఏమి వస్తుంది చాక్లెట్ కూడా రావడం కష్టంగా ఉంది. అయితే ఈ రూపాయి నాణెం మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్టే ఎందుకంటే దాని విలువ లక్షల్లో ఉంటుంది. చాలా మందికి పురాతన వస్తువులను సేకరించడం ఇష్టం. పాత అరుదైన నాణేలను సేకరించడానికి ఇష్టపడతారు. అలాంటి వారు ఈ నాణాలకు అత్యధిక ధర ఇస్తారు.

1906, 1917, 1918 లో తయారు చేయబడిన 1 రూపాయి నాణెలకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నాణెలు ధర రూ. 20 లక్షల మేర పలుకుతున్నాయి. ఇక ఈ నాణాల కోసం చాలా మంది కాయిన్స్ కలెక్ట్ చేసేవారు చూస్తున్నారు. ఈ-కామర్స్ సైట్లు ఈ రకమైన అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ నాణాలు మీ దగ్గర ఉంటే quikr.com సైట్లో ఆన్లైన్ లో మీ పేరును నమోదు చేసుకోండి.

లాగిన్ అయ్యాక రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి నాణెం కొనాలంటే.. Buy Now ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఒక వేళ ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే అమ్మాలి అనుకుంటే Make Offer అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇలా మేక్ ఆఫర్పై క్లిక్ చేసిన తరువాత మీ వద్ద ఉన్న నాణెం ఫొటోను అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేసిన ఫోటోను ఎవరైనా కొనుగోలుదారులు చూసినట్లయితే వారు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు.