స్మార్ట్‌ఫోన్‌ హ్యాంగ్‌ అవుతోందా? అయితే ఈ టిప్స్‌ పాటించండి

Is the smartphone hanging? Follow these tips though

0
112

ప్రస్తుతం స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. యువ‌కులు, చిన్నారుల నుంచి మొదలు పెద‌వాళ్ల వ‌ర‌కు అంద‌రూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడ‌ల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న కొన్ని ఫోన్ లు మాత్రం తరచూ సతాయిస్తుంటాయి. ఎప్పటికి హ్యాంగ్ అవుతూ ఇబ్బంది పెడుతుంటాయి.  ఫోన్లు హ్యాంగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కంప్యూటర్లలో, స్మార్ట్‌ఫోన్లలో ఎల్లప్పుడూ ఫ్రీ స్పేస్‌ ఉండేలా చూసుకోవాలి. ఫోన్‌ కెపాసిటీ ఉంది కదా అని అతిగా డాటా నిల్వ చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ స్టోరేజీ సామర్థ్యానికి దగ్గరగా డాటా చేరుకున్నట్లయితే ఫోన్‌ నెమ్మదించడం, హ్యాంగ్‌ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి.

సోషల్‌ మీడియా యాప్‌ల్లో మనం పంపిన సందేశాలు, వీడియోలకు అవసరమైన స్టోరేజ్‌ లేకపోవడమూ దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

సెట్టింగ్స్‌లోకెళ్లి స్టోరేజీ సెట్టింగ్‌లో ఫ్రీ స్పేస్‌ ఉందో చెక్ చేసుకోవాలి. ఇంటర్నెల్ స్టోరేజీ నిండిపోయినట్లయితే Settings- Storage-Cache క్లిక్‌ చేస్తే కొంచెం స్పేస్‌ ఫ్రీ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లో ఏదో అవసరం పడినపుడు కొన్ని యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటాం. అవసరం తీరాక దాన్ని అలాగే ఉంచేసి మరచిపోతాం. అలాంటి ఓపెన్‌ చేయని యాప్స్‌ ఫోన్‌లో ఎన్ని ఉన్నాయో చూసుకొని వాటిని రీమూవ్‌ చేయాల్సిందే. ఇలాంటి అనవసరమైన యాప్స్‌ వల్ల ఫోన్‌లో స్పేస్‌ వృథాగా పోతోంది.

ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సింపుల్‌ ట్రిక్‌. ఫోన్‌ను రీస్టార్ట్‌ చేసినపుడు బ్యాక్ గ్రౌండులో మెమెరీ క్లీన్ అవుతుంది. అంతేకాకుండా ఫోన్‌లో ఉన్న అప్లికేషన్స్‌ కూడా రీసెట్‌ అవుతాయి. ఫోన్ పవర్ బటన్ నొక్కి పట్టుకుంటే రీస్టార్ట్ ఆప్షన్ కనిపిస్తోంది. దీన్ని క్లిక్‌ చేస్తే ఫోన్‌ రీస్టార్ట్‌ అవుతోంది.