న్యూజిలాండ్ లో నవారు మంచం ఎంతకి అమ్ముతున్నారో తెలిస్తే షాక్

It would be a shock to how much cost of beds sold in New Zealand

0
90

నవారు మంచాలు గతంలో మన అందరి ఇళ్లల్లో ఉండేవి. కాని ఇప్పుడు ఈ నవారు మంచాలు ఎక్కడో వీధికి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి. వీటి వాడకం బాగా తగ్గింది అయితే పల్లెటూరులో ఇప్పటికీ కొందరు వీటిని వాడుతున్నారు. కొన్ని కుటుంబాలు నవారు మంచంపై పడుకుంటున్నారు. ఇప్పటికీ వేసవికాలం వచ్చిందంటే ఆరు బయట నవారు మంచం మీద కునుకువేసే వారు చాలా మంది ఉన్నారు.

అయితే వీటి ధర ఎంత ఉంటుంది అంటే రేటుచూస్తే 2000 నుంచి 5000 ఉంటుంది. కానీ న్యూజిలాండ్లో మాత్రం నవారు మంచం ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అన్నాబెల్లె అనే ఓ ఈ కామర్స్ సైట్ వింటేజ్ ఇండియన్ డే బెడ్తో నవారు మంచానికి ఏకంగా 41, 297 రూపాయల ధర నిర్ణయించింది.

దీని రేటు 61,980 ఉండగా డిస్కౌండ్ తరువాత ఇప్పుడు 41, 297 రూపాయల ధర నిర్ణయించింది. ఈ మంచం ఇంత రేటు పెట్టి కొంటారా అని ఆశ్చర్యపోతున్నారు అందరూ.